జనగామ, 10 November
ఉమా మహేశ్వర ఆలయం లో కార్తీక జ్యోతి
కార్తీక మాసం తొలి రోజు సందర్భంగా జిల్లా కేంద్రంలోని గుండ్లగడ్డ కాలనీ శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం సాయంత్రం కార్తీక ఆకాశ దీపాన్ని భక్తిశ్రద్ధలతో వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆలయ పూజారి అయ్యగారు సాంబమూర్తి శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్, నరసింహారావు, శ్రీకాంత్, విజయ్, నిఖిల్, చారి, ఉమ, రేణుక, రమ, శ్రీలత, హైమ, విజయలక్ష్మి తదితర భక్తులు పాల్గొన్నారు.






