*సిద్దిపేట (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 16
సిద్దిపేట జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అడ్వకేట్ గడ్డం అలియాస్ తౌడబోయిన రేణుకను నియమించారు. ఈ నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ఆమె గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో అందుకున్నారు.
సిద్దిపేట జిల్లాకు చెందిన అడ్వకేట్ గడ్డం అలియాస్ తౌడబోయిన రేణుకను జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కా లాంబా, తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ చేతుల మీదుగా అధికారిక నియామక ఉత్తర్వుల ప్రతిని అందుకున్నారు. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జిల్లా స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో మహిళా కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు మహిళల హక్కుల పరిరక్షణ, మహిళా సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధి, బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు. తన నియామకానికి సహకరించిన జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కా లాంబా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు గంగాపురం సంతోషి, కోటగిరి ఎల్లవ్వ, బద్రి భవాని, బీజా నాభి, గడ్డం శ్యామల, స్రవంతి, వనజ, సంతోషి తదితరులు పాల్గొన్నారు. అడ్వకేట్ రేణుకకు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.







