సిద్దిపేట, తెలంగాణ (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 18
రేపు, 19న సిద్దిపేట వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలు వినూత్న రీతిలో స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. గత ప్రభుత్వంలో మంజూరై, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆగిపోయిన పనులకు సంబంధించిన ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఆగిపోయిన, రద్దు అయిన పనులను కొనసాగించాలని ఆ ఫ్లెక్సీల ద్వారా విజ్ఞప్తి చేశారు.

వెటర్నరీ కళాశాల ఆవేదన
నిర్మాణంలో ఉన్న వెటర్నరీ కళాశాల ఎప్పుడు ప్రారంభమవుతుందోనని ఆవేదన వ్యక్తం చేస్తుండగా, మరోవైపు విద్యార్థులు కళాశాలను తిరిగి అప్పగించాలని కోరుతున్నారు. శిల్పా రామం, వెయ్యి పడకల ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల, సిద్దిపేట ఇల్లంతకుంట రోడ్డు, వెజ్-నాన్ వెజ్ మార్కెట్ వంటి ఆగిపోయిన పనుల వద్ద కూడా ఫ్లెక్సీలను ప్రదర్శించారు.
ముఖ్యమంత్రి సిద్దిపేట వస్తున్న సందర్భంగా ఈ ఫ్లెక్సీల ప్రదర్శన ఆసక్తిని రేకెత్తించింది.