సిద్దిపేట, 18 November
జిల్లా కేంద్రంలో గురువారం జరగనున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి బహిరంగ సభకు దుబ్బాక నియోజకవర్గ యువత అధిక సంఖ్యలో హాజరుకావాలని యూత్ కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బురాని శ్రీకాంత్ పిలుపునిచ్చారు.
జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి భారీ బహిరంగ సభకు దుబ్బాక నియోజకవర్గంలోని యువతీ యువకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని యూత్ కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గ ఉపాధ్యక్షుడు, కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సభకు నియోజకవర్గంలోని యువత అధిక సంఖ్యలో తరలివచ్చి పాల్గొనాలని ఆయన కోరారు. యువత సమష్టిగా తరలివచ్చి సభకు హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.







