ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 444 ఉల్లంఘన కేసులు నమోదు చేసినట్లు పోలీసు శాఖ వెల్లడించింది. ఈ వ్యవహారంలో 24 ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి.
ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా 722 కేసుల్లో మొత్తం 5,327 మందిపై బైండోవర్ చర్యలు తీసుకున్నట్లు ఏపీ ఐజీ, రాష్ట్ర ఎన్నికల సంఘం సమన్వయకర్త బి. రాజకుమారి వెల్లడించారు. ఈ చర్యలు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత ()లోని 126, 129 సెక్షన్ల కింద చేపట్టినట్లు తెలిపారు.
మద్యం స్వాధీనం
ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు చేపట్టిన తనిఖీల్లో 200.55 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని పలు పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలకు విడతలవారీగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీసుల చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.






