కేరళలోని కొల్లం జిల్లా చడయమంగళంలో ఉన్న జటాయు ఎర్త్ సెంటర్లోని భారీ జటాయు శిల్పం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. రామాయణం సినిమా నేపథ్యంలో జటాయువు పోరాటం చర్చనీయాంశం కావడంతో, ఈ శిల్పాన్ని సందర్శించేందుకు సినీ అభిమానులు, పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు.
కేరళలోని జిల్లా చడయమంగళంలో ఉన్న జటాయు ఎర్త్ సెంటర్లోని భారీ జటాయు శిల్పం ప్రస్తుతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇటీవల విడుదలైన రామాయణం సినిమా నేపథ్యంలో సీతాదేవిని రావణుడి చెర నుంచి రక్షించేందుకు జటాయువు చేసిన పోరాటం మరోసారి చర్చనీయాంశమైంది. దీంతో ఈ శిల్పాన్ని సందర్శించేందుకు పర్యాటకులు, సినీ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి శిల్పంగా గుర్తింపు పొందిన ఈ నిర్మాణాన్ని కళాకారుడు, శిల్పి రాజీవ్ ఆంచల్ రూపొందించారు. కొండపై ఏర్పాటు చేసిన ఈ పర్యాటక కేంద్రంలో శ్రీరాముడి ఆలయం కూడా ఉంది. కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ఈ ప్రాంతాన్ని సందర్శించాలని దేశవ్యాప్తంగా పర్యాటకులకు ఆహ్వానం పలికారు.





