కొండపాక్, 2026-11-22
బీఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు మెరుగోజు గాలయ్యచారి రెండవ కుమారుడు ప్రవీణ్ కుమార్ వివాహానంతర అభినందన వేడుక ఆదివారం కొండపాకలోని వైష్ణవి గార్డెన్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు బీఆర్ఎస్ పార్టీ ప్రముఖులు హాజరయ్యారు.
బీఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు మెరుగోజు గాలయ్యచారి రెండవ కుమారుడు ప్రవీణ్ కుమార్ వివాహానంతర అభినందన వేడుక ఆదివారం వైష్ణవి గార్డెన్స్‌లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ ఎంఎల్‌సి యాదవ రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి వంటేరు ప్రతాపరెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ చందన, కొండపాక జడ్పిటిసి అనంతుల ప్రశాంత్, కొండపాక మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్, అంకిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ గాలి బాలయ్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన దంపతులు ప్రవీణ్ కుమార్, వైష్ణవిలకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు.
ఈ వేడుకలో గ్రామ పాలకవర్గ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.







