నంగునూర్ మండలంలోని నర్మెట ఎంపీపీఎస్ పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మనీష్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
రాజ్యాంగ విలువలు-పౌర బాధ్యతలు
అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి గొప్ప విలువలను విద్యార్థులకు వివరించారు. రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ గౌరవం కలిగి ఉండాలని, రాజ్యాంగ స్ఫూర్తితో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మనీష్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.







