వరంగల్, 19 November
ఉద్యమ సహచరుడి మరణంపై రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ తీవ్ర విచారం వ్యక్తం
తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అచ్చ విద్యాసాగర్ అకాల మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అచ్చ విద్యాసాగర్ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అచ్చ విద్యాసాగర్‌తో తనకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉందని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఇద్దరం కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నామని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. పార్టీ కష్టకాలంలోనూ అంకితభావంతో పనిచేస్తూ, నాయకులు, కార్యకర్తలకు అండగా నిలిచిన వ్యక్తి అని కొనియాడారు.
ఆయన మరణం తెలంగాణ ఉద్యమ కుటుంబానికి, ఉమ్మడి జిల్లా రాజకీయాలకు తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి తదితరులు పాల్గొని అచ్చ విద్యాసాగర్‌కు నివాళులర్పించారు.







