ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన చెక్కులను 14 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ఆయన తెలిపారు. దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, అధికారులు దరఖాస్తుల పరిశీలన, పథకాల అమలును సకాలంలో పూర్తి చేసి వారికి సహకరించాలని ఆయన సూచించారు. అనంతరం ఆగాపేట గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కేవీ రామానుజాచారి, ఎంపీడీవో సుమన్, డీటీ కె. వేణు, ఆర సాయిబాబా, స్థానిక సర్పంచ్ గోపగోని శ్రీధర్, సర్పంచుల ఫోరం జేఏసీ అధ్యక్షుడు కంతి అంజనేయులు, వివిధ గ్రామాల సర్పంచులు డా. పగిడిపాటి రాజు, లింగాల హైమా రమేష్, భూక్య రమేష్, బానోత్ మహేందర్, పండుగ జ్యోతి రమేష్, మండల అధ్యక్షుడు చింతకింది సురేష్, రాష్ట్ర నాయకుడు గద్దల నర్సింగరావు, తాజా మాజీ ఎంపీపీ తేజావత్ గోవర్ధన్, నాయకులు ఎండీ గౌస్, నీరేటి సుధాకర్, ముప్పిడి ప్రతాప్, వంగ ప్రణీత్‌రెడ్డి, పిట్టల రాజు, నక్కల రవి, ఎండీ యాకూబ్్పషా, పాతూరి తిరుపతిరెడ్డి, ఎలబోయిన నరేష్, కొన్నె సంపత్, మేడబోయిన రాజు, మంద వాసు, పిట్టల కృష్ణమూర్తి, ఎర్ర కర్ణాకర్, ముక్కెర మహేందర్, పాపన్న తదితరులు పాల్గొన్నారు.









