కాంగ్రెస్ నాయకుడు ధరావత్ రాజునాయక్, బండి బిక్షపతి సతీమణి బండి కళ్యాణి మృతికి నివాళులర్పించారు.
బండి కళ్యాణి, గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ, సోమవారం రాత్రి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
ఈ సందర్భంగా, ధరావత్ రాజు ఆమె పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ఇట్టబోయిన సురేష్, వార్డు సభ్యులు ఇట్టబోయిన శ్రీను, బానోతు కుమార్, బండి వెంకన్న, ఉప్పలయ, మేకల మల్లేష్, మధు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.








