మండలం పెద్దమడూరులో కాంగ్రెస్ నాయకురాలు ఐలమ్మ కుటుంబాన్ని ఓదార్చిన ఎమ్మెల్యే
మండలం పెద్దమడూరు గ్రామ కాంగ్రెస్ నాయకులు గనుపాక రవి తల్లి గనుపాక ఐలమ్మ ఇటీవల మరణించగా, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఐలమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, ఐలమ్మ గారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి, ఈ కష్ట సమయంలో వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దావెరా అనిల్ కుమార్, జిల్లా నాయకులు తోటకూరి పాండు కృష్ణ, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఇనుముల నాగరాజు, బీసీ సెల్ అధ్యక్షులు కాడబోయిన గణేష్, కిసాన్ సెల్ అధ్యక్షులు గోపు సుధాకర్ రెడ్డి, గుగులోతు రాజేందర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పులిగిల్ల వెంకన్న, రుద్రోజు భాస్కర చారి, రెడ్డి రాజుల రమేష్, సైదులు రెడ్డి, రవీందర్ రెడ్డి, ముదిగొండ పరశురాములు, వార్డు సభ్యులు పానుగంటి ప్రశాంత్, పురుషోత్తం చారి, తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.












