తరిగొప్పుల, ఓరుగల్లు, 2026-11-26
జనగామలో మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి బైండోవర్ చేశారు.
జనగామలో గురువారం మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. అరెస్టు అయిన వారిలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి చిలువేరు లింగం, మాజీ సర్పంచ్ దామెర ప్రభుదాస్, సీనియర్ నాయకులు తాళ్లపల్లి రాజేశ్వర్ గౌడ్,భూస యాదయ్య,రాజు నాయక్ ఉన్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ...ముందస్తు అరెస్టులు, బైండోవర్లతో తమ పోరాటాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. అరెస్టులకు భయపడే నాయకత్వం తమది కాదని, ప్రజల పక్షాన నిలిచి పోరాడే నాయకత్వమని పేర్కొన్నారు.
పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో, జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి సారథ్యంలో ప్రజా సమస్యలపై తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.







