సహకరించి (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 11
ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తామని వెల్లడి
తరిగొప్పుల: మండల నూతన ఎస్సైగా చెన్న కేశవులు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఆయన తరిగొప్పుల పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎస్సై చిన్న కేశవులు మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు, చట్టవ్యతిరేక చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు పోలీసులకు మండలంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు భాగస్వాములు కావాలని కోరారు.






