సారాంశం
ఓటర్ల జాబితా సవరణపై విపక్షాల తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు
ముఖ్య విషయాలు
- 1ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లో ఎండగట్టాలని, ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా పాదయాత్రలలో భాగంగా ఉదయం 10 గంటలకు కరీంనగర్లో నిర్వహించనున్న మహా పాదయాత్రను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
- 2ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పై ప్రజల్లో నెలకొల్పుతున్న అపోహలను తొలగించేందుకు పార్టీ శ్రేణులంతా క్షేత్రస్థాయిలో చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.
- 3ఈ మహా పాదయాత్రలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పాల్గొంటున్న నేపథ్యంలో, కరీంనగర్ పాదయాత్ర దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యేలా ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో కష్టపడి పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
- 4కరీంనగర్లో పార్లమెంట్ స్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో మహా పాదయాత్ర విజయవంతానికి చేపట్టాల్సిన కార్యాచరణ, నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యం, ప్రజల్లో విస్తృత ప్రచారం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి, దిశానిర్దేశం చేశారు.
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లో ఎండగట్టాలని, ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా పాదయాత్రలలో భాగంగా ఉదయం 10 గంటలకు కరీంనగర్లో నిర్వహించనున్న మహా పాదయాత్రను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ మహా పాదయాత్రలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పాల్గొంటున్న నేపథ్యంలో, కరీంనగర్ పాదయాత్ర దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యేలా ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో కష్టపడి పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పై ప్రజల్లో నెలకొల్పుతున్న అపోహలను తొలగించేందుకు పార్టీ శ్రేణులంతా క్షేత్రస్థాయిలో చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.
కరీంనగర్లో పార్లమెంట్ స్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో మహా పాదయాత్ర విజయవంతానికి చేపట్టాల్సిన కార్యాచరణ, నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యం, ప్రజల్లో విస్తృత ప్రచారం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి, దిశానిర్దేశం చేశారు.