తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని జనగామలోని అతిథి గురుకులంలో చిన్నారుల సమక్షంలో జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి-శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు.
అలాగే చిన్నారులతో కొంత సమయం గడిపి వారికి దీపావళి సందర్భంగా టపాకాయలు అందించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మంచి విద్య, నాణ్యమైన వసతులు అందించి, ఉన్నత లక్ష్యాలను సాధించేలా ప్రోత్సహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.







