జనగామ, 10 November
జనగామ లో తప్పిన పెను ప్రమాదం
ఆర్టీసీ చౌరస్తా వద్ద మంగళవారం పెను ప్రమాదం తప్పింది. సూర్యాపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బస్టాండ్ లోకి వస్తుండగా, ఒక్కసారిగా వెనుక చక్రం నట్లు ఊడిపోయాయి. డ్రైవర్ అప్రమత్తమై బస్సును వెంటనే నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ ఆకస్మిక పరిణామంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపటికే ప్రమాదం జరగాల్సి ఉండగా, డ్రైవర్ చాకచక్యంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టే అవకాశం ఉంది.






