Jangaon/Tharigoppula (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 22
మత్స్య సహకార సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తా... మత్స్య సొసైటీ వైస్ చైర్మన్ కనుకరాజు
మత్స్య సహకార సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానని సొసైటీ వైస్ చైర్మన్ కనకరాజు అన్నారు.ఈ సందర్భంగా తరిగొప్పుల మత్స్య సహకార సొసైటీ వైస్ చైర్మన్ గా ఎన్నికైన సుంకరి కనకరాజును జనగామకు చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా సన్మానించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు కనకరాజును శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గద్దల నర్సింగరావు, జిల్లా నాయకులు పెద్ది రాజిరెడ్డి, జనగామ మున్సిపల్ వైస్‌చైర్మన్ భూష పర్వతాలు, కౌన్సిలర్లు గోపగోని సుగుణాకర్, సే వెళ్ల మధుసూదన్, పానుగంటి సువార్త, జనగామ టౌన్ అధ్యక్షుడు తాళ్ల సురేష్‌రెడ్డి, ఇంగదుల కృష్ణ, వడ్లకొండ మాజీ సర్పంచ్ శారద, మండల యువ నాయకుడు చిలువేరు సతీష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.







