అంకుషాపూర్ గ్రామ ఉప సర్పంచ్ నాగపురి కిషన్ గౌడ్ బాబాయ్ చిన్న కుమారుడు యశ్వంత్ గౌడ్ (18) అకాల మరణం పట్ల జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలవాలని ఆయన ఆదేశించారు. మృతుడి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందజేయాలని ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. నాగపురి కిషన్ గౌడ్ తో ఫోన్లో మాట్లాడి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలవాలని తరిగొప్పుల మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కుర్రె మల్లయ్య, అంకుషాపూర్ సర్పంచ్ బైకాని రమా బాలరాజు యాదవ్ ను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కుర్రె మల్లయ్య, బైకాని రమా బాలరాజు యాదవ్ అంకుషాపూర్ గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. యశ్వంత్ గౌడ్ కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా మృతుడికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. యశ్వంత్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. కార్యక్రమంలో సర్పంచ్లు దండెం శ్రీనివాస్, భూక్యా దనూష్ నాయక్, గుగులోత్ లలిత రాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు చెప్యాల రాజశేఖర్ గౌడ్, మాజీ ఎంపీపీ నూకల కృష్ణమూర్తి, నాయకులు ఉట్ల మల్లారెడ్డి, ఎండీ ఖాసీం, పంగ కిరణ్ కుమార్, పోగుల రామయ్య, మందగాన్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
యశ్వంత్ గౌడ్ అకాల మరణం పట్ల ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి దిగ్భ్రాంతి
Share:

సారాంశం
అంకుషాపూర్ గ్రామ ఉప సర్పంచ్ నాగపురి కిషన్ గౌడ్ బాబాయ్ చిన్న కుమారుడు యశ్వంత్ గౌడ్ (18) అకాల మరణం పట్ల జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలవాలని ఆయన ఆదేశించారు. మృతుడి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందజేయాలని ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్య విషయాలు
- అంకుషాపూర్ గ్రామ ఉప సర్పంచ్ నాగపురి కిషన్ గౌడ్ బాబాయ్ చిన్న కుమారుడు యశ్వంత్ గౌడ్ (18) అకాల మరణం పట్ల జనగామ ఎమ్మెల్యే డా.
- మృతుడి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందజేయాలని ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు.
- నాగపురి కిషన్ గౌడ్ తో ఫోన్లో మాట్లాడి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలియజేశారు.
- ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలవాలని తరిగొప్పుల మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కుర్రె మల్లయ్య, అంకుషాపూర్ సర్పంచ్ బైకాని రమా బాలరాజు యాదవ్ ను ఆదేశించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Bhasakr
Reporter
Andaman and Nicobar Islands
233ఆర్టికల్స్
43,699వ్యూస్







