జనగామ, 2026-11-26
భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం వంటి గొప్ప విలువలను అందించిందని కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి () జాతీయ అధ్యక్షులు డా.
భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం వంటి గొప్ప విలువలను అందించిందని కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి () జాతీయ అధ్యక్షులు డా. జేరిపోతుల పరశురామ్ అన్నారు. జనగామ జిల్లా జనగామలో ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఆయన పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు పౌరులుగా మన బాధ్యతలను కూడా గుర్తించాలని, రాజ్యాంగ స్ఫూర్తిని భావితరాలకు అందించాలని పేర్కొన్నారు. అదేవిధంగా, భారత కరెన్సీ నోట్లపై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించాలనే ఉద్యమ లక్ష్య సాధన కోసం దేశవ్యాప్తంగా మరింత విస్తృతంగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ఈ నెల 17, 18 తేదీలలో మహాధర్నా నిర్వహిస్తున్నామని, ఆ ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో దళిత బహుజన సంఘాల నాయకులు డాక్టర్ సిహెచ్ రాజమౌళి, డాక్టర్ కృష్ణ, కౌన్సిలర్ ఊడుగుల కిష్టయ్య, మాజీ కౌన్సిలర్ రాంచందర్, వంకాడోత్ అనిత, కొయ్యడ మల్లేష్, బోట్ల నర్సింగరావు, నిర్మాల రాములు, పసుల ఏబెల్, రాగల్ల శ్రీహరి, కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ సలహాదారులు మల్లిగారి రాజు, తిప్పారపు విజయ్, తాళ్ల పెళ్లి ఎల్లేష్, తిప్పారపు ప్రసాద్, మిద్దపాక రాజు, మచ్చ కుమార్, చింతల కనకరాజు, మాచర్ల ఆశిష్, దామెర మౌనిక, తదితరులు పాల్గొన్నారు.







